అక్రమంగా తరలిస్తున్న టేకు కలప స్వాధీనం

ఎల్లారెడ్డిపేట, జనంసాక్షి: మండలంలోని వీర్లపల్లి శివారులో అక్రమంగా రెండు ఎడ్లబళ్లలో తరలిస్తున్న టేకు కలపను అటవీశాఖాధికారులు సోమవారం పట్టుకున్నారు. 40 దుంగల విలువ రూ. 24వేలు ఉంటుందని అధికారులు చెప్పారు. నిజామాబాద్‌ జిల్లా మానాల పరిధిలోని వీరోలితండాకు చెందిన గుగులోత్‌ బక్ష , గుగుతోత్‌ లాల్‌సింగ్‌, గుగులోత్‌ పరశురాములు, రవి తదితరులపై కేసు నమోదు చేసినట్టు సెక్షన్‌ అధికారి బాపిరాజు తెలిపారు. పటుట్టకున్న కలపను సిరిసిల్ల అటవీ క్షేత్ర కార్యాలయానికి తీసుకెళ్లారు. ఈ దాడుల్లో సెక్షన్‌ అధికారి జి.శ్రీనివాస్‌, బీట్‌ అధికారులు, ఆంజనేయులు, బాలయ్య బేస్‌క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.