అక్రమార్కులకు సహకరిస్తే కేసులు

 

కడప,జూన్‌13(జ‌నం సాక్షి): ఎర్రదొంగలకు సహకరించి స్థానికులు కేసుల్లో చిక్కుకోవద్దని పోలీసులు హెచ్చరించారు. అక్రమార్కులకు సహకరించే వారిపై టాడా కేసులు పెడతామన్నారు. ఈ మేరకు ఆయా గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ప్రపంచంలోని ఎక్కడా దొరకని ఎర్రచందనం మన రాయలసీమలో ఉందని, అటువంటి సంపదను సంరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉందని ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పేర్కొన్నారు. ఎర్రచందనం రక్షణపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. కొంత మంది స్వార్థపరులు ధనమే ధ్యేయంగా ఎర్రచందనాన్ని ఇతర దేశాలకు అక్రమంగా రవాణ చేస్తున్నారని మండిపడ్డారు. ఎర్రచందనం అక్రమ రవాణా నేరమని అటువంటి వారిపై ప్రభుత్వం నేడు కఠిన శిక్షలు అమలు చేస్తోందన్నారు.