అక్రమ అరెస్టులకు నిరసనగా రాస్తారోకో
సిరిసిల్ల పట్టణం: సడక్‌బంద్ సందర్భంగా తెరాస ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా తెరాస ఆధ్వర్యంలో పట్టణంలో రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వం తెలంగాణవాదాన్ని అగణతొక్కడానికి ప్రయత్నిస్తోందని తెరాస పట్టణ అధ్వక్షుడు చక్రపాణి అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.