అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం.
విలేకరులతో మాట్లాడుతున్న కార్మిక సంఘాల నాయకులు.
బెల్లంపల్లి, సెప్టెంబర్26,(జనంసాక్షి)
సింగరేణిలో న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కార్మిక సంఘాల నాయకులు అన్నారు. బెల్లంపల్లి పట్టణంలో సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతాలలో ఈనెల తొమ్మిది తారీకు నుంచి నేటి వరకు సమ్మె చేస్తున్నటువంటి సింగరేణి కాంట్రాక్టు కార్మికు లకు నాయకత్వం వహిస్తున్న ట్రేడ్ యూనియన్ నాయకులను తెల్లవారుజామున అరెస్టు చేయడం హేయమైన చర్య అన్నారు. అక్రమ అరెస్టుల ద్వారా ఉద్యమాన్ని ఆపలేరనేది చరిత్ర చెప్పిన సత్యం అన్నారు. ఈనెల తొమ్మిది తారీకు నుండి ఇప్పటివరకు ఆర్ ఎల్ సి వద్ద హైదరాబాద్ లో రెండు సార్లు చేసిన చర్చలు విఫలం అయ్యాయన్నారు. మూడోదఫా ఈరోజు కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మరోసారి చర్చలు ఈరోజు ఉన్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మరియు సింగరేణి యాజమాన్యం చర్చలకు వెళ్లకుండా నాయకులను అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం హై పవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం 22 జీవోను గెజిటెడ్ చేయాలని తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న సమ్మెను విచ్చిన్న చేయడమే ఈ యొక్క అరెస్టులు నిదర్శనం అన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన నాయకులను, కాంట్రాక్టు కార్మికులను బే షర్టుగా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సింగరేణి యాజమాన్యాన్ని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేస్తుందన్నారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరో తీవ్రస్థాయికి తీసుకుపోయే అవకాశం ఇవ్వకుండా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు నీరటి రాజన్న, ఎస్జీకేఎస్ రాష్ట్ర కన్వీనర్ అంబాల మహేందర్, బిఎల్టీయు జిల్లా కార్యదర్శి కన్నూరి సమ్మయ్య పాల్గొన్నారు.