అక్రమ కిరోసిన్ పట్టివేత
మహబూబ్‌నగర్, జనంసాక్షి: అక్రమంగా నిలువ ఉంచిన ప్రజాపంపిణీకి చెందిన కిరోసిన్‌ను అధికారులు పట్టుకున్నారు. ధరూర్ మండలం మన్నాపురం గ్రామశివారులో ఓ స్టోన్ క్రషర్‌లో నిలువ ఉంచిన తొమ్మిది వేల లీటర్ల కిరోసిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకుని స్టేషన్ తరలించారు. కిరోసిన్‌ను నిల్వ ఉంచిన ప్లాంట్ మంత్రి డీరే అరుణ కుటుంబానికి చెందినదిగా తెలుస్తుంది.