అక్రమ నిర్మాణాలపై సమగ్ర నివేదిక కోరిన లోకాయుక్త
హైదరాబాద్: హైదరాబాద్ శివారు మణికొండలో అక్రమ నిర్మాణాలపై లోకాయుక్త మండిపడింది. ఫిబ్రవరి 1 లోగా ఇంటింటా సర్వే చేపట్టి అక్రమ నిర్మాణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని హెచ్‌ఎండీఏ కమిషనర్‌ను లోకాయుక్త ఆదేశించింది. మణికొండలో ఇబ్బడిముబ్బడిగా సాగుతున్న అక్రమ నిర్మాణాలపై గ్రామస్తుడు ఫిర్యాదుపై 2010లో లోకాయుక్త కేసు నమోదుచేసింది. దీని పై ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లా సంయుక్త కలెక్టర్ జగన్నాథం విచారణ చేపట్టారు. సంయుక్త కలెక్టర్ జగన్నాథం ఇవాళ 9 అంశాలతో కూడిన నివేదిక లోకాయుక్తకు సమర్పించారు. కేసును తీవ్రంగా పరిగణించిన లోకాయుక్త చైర్మన్ సుభాషణ్‌రెడ్డి రెవెన్యూ అధికారులను విచారణ నుంచి తప్పించారు. హెచ్‌ఎండీఏ కమీషనర్ నీరవ్‌కుమార్ ప్రసాద్ ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని లోకాయుక్త ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి ఒకటవ తేదీకి వాయిదా వేసింది.