అక్రమ నిర్మాణాల తొలగింపు ఉద్రిక్తం

హైదరాబాద్‌: మణికొండలో అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. నిర్మాణాలు తొలగించవద్దని స్థానికులు అధికారులను అడ్డుకోవడంతో  అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారిపై స్వల్ప లాఠీఛార్జీ చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి.