అక్రమ మైనింగ్ కేసు: రూ.32కోట్ల జరిమానా.. హైకోర్టు ఆదేశం

అక్రమ మైనింగ్ కేసులో అధికారులు విధించిన 32 కోట్ల రూపాయల జరిమానా చెల్లించాలని కాంగ్రెస్ నేత భరతసింహారెడ్డిని హైకోర్టు ఆదేశించింది. తక్షణమే మైనింగ్ నిలిపివేయాలని ఆదేశించింది. ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మహబూబ్ నగర్ జిల్లా ధరూర్ మండలంలో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.