అఖిలభారత మహాసభలను జయప్రదం చేయండి.

భారత విద్యార్థి ఫెడరేషన్ అఖిలభారత మహాసభలు తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ గడ్డపై డిసెంబర్ 13 నుండి 16 వరకు జరుగుతున్న సందర్భంగా , మహాసభలను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జహీరాబాద్ ఏరియా కార్యదర్శి రాజేష్  ఏరియా లో కరపత్రాలు ఆవిష్కరణ చేశారు… ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ దేశంలోనే విద్యారంగ సమస్యల మీద రాజి లేని పోరాటాలు చేస్తూ, దేశంలో ప్రతి ఒక్క విద్యార్థికి సమాన విద్య అందించాలని, శాస్త్రీయ విద్యా విధానం కోసం అలుపెరుగని పోరాటం చేస్తుందని అన్నారు.. భారత విద్యార్థి ఫెడరేషన్ అఖిల భారత మహాసభలు తెలంగాణలో జరగడం అభినందనీయమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేయాలని , సంక్షేమ హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని రాజేష్ అన్నారు.. దేశం నుండి నలుమూలల రాష్ట్రాల నుండి విద్యార్థి ప్రతినిధులు హాజరు కాబోతున్నారని, భవిష్యత్తు కర్తవ్యాలు , తీర్మానాలు చేసుకొని ఉద్యమా రూపకల్పన కోసం ఈ మహాసభలు జరుగుతున్నాయని అన్నారు.. ఈ సందర్భంగా మహాసభలు జయప్రదం చేయాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో చంద్ర వర్ధన్ హరీష్ రాఘవేంద్ర  అతిక్  తదితర విద్యార్థులు పాల్గొన్నారు..