అఖిలేష్ వ్యాఖ్యలపై బిజెపి మండిపాటు
ప్రజల విశ్వాసాలపై అనుచిత వ్యాఖ్యలు తగవు
అఖిలేశ్ తీరును ఎండగట్టిన కేంద్రమంత్రి ఠాకూర్
న్యూఢల్లీి/లక్నో,డిసెంబర్14 (జనంసాక్షి ): జనం తమ చివరి రోజులు గడిపేందుకు కాశీ వెళ్తుంటారని ప్రధాని వారణాసి పర్యటనను ఉద్దేశించి సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడిరది. అఖిలేష్ వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితిని చాటుతున్నాయని ఘాటుగా స్పందించింది. ఇది ప్రజల నమ్మకాన్ని అపహాస్యం చేయడమేనని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. వారణాసిలో రెండు రోజుల పర్యటనకు ప్రధాని సోమవారంనాడు రావడంపై అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. మంచిదే. వాళ్లు నెల రోజులే కాదు, రెండు మూడు నెలలు కూడా ఉండొచ్చు. జనం తమ చివరి రోజులు గడిపేందుకు ఇక్కడకు అంటే కాశీ వస్తుంటారని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రతి ఒక్కరితోనూ అబద్దాలు చెబుతోందని, కానీ భగవంతుడి ముందు అబద్దాలు చెప్పడం సరికాదని అఖిలేశ్ హితవు పలికారు. కాగా, అఖిలేష్ చేసిని ’చివరిరోజులు’ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారంనాడు ఢల్లీిలో స్పందించారు. అఖిలేష్ యాదవ్ వాడిన భాష ఆయన మానసిక స్థితిని చెబుతున్నాయని, సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న ఆందోళనకు ఆయన మాటలు అద్దం పడుతున్నాయని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రి నోట వినాల్సి రావడం దురదృష్ట కరమని, అలా మాట్లాడతారని ఊహించలేదని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఇకపోతే గంగానది మురికి కూపమని యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్‌కు తెలుసు కునుకే ఆయన అందులో మునకేయలేదని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎద్దేవా చేవారు. గంగానది ప్రక్షాళన కోసం కాషాయ పార్టీ రూ కోట్లు వెచ్చిస్తోందని.. అయినా గంగానది మురికి సంగతి తెలిసినందునే యోగి ఆదిత్యానాధ్ నదిలో పవిత్ర స్నానం ఆచరించ లేదని అఖిలేష్ ఆరోపించారు. గంగానదిని ఎప్పుడు ప్రక్షాళన చేస్తారని ఆయన నిలదీశారు. గంగానదిని
శుభ్రం చేసేందుకు కోట్లు కుమ్మరిస్తున్నా నది ప్రక్షాళన పూర్తికావడం లేదని అఖిలేష్ ఆందోళన వ్యక్తం చేశారు. వారణాసిలో సోమవారం కాశీ విశ్వనాధ్ కారిడార్ ప్రారంభోత్సవం నేపధ్యంలో అఖిలేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాశీ విశ్వనాధ్ కారిడార్‌ను ప్రధాని మోదీ ప్రారంభించిన క్రమంలో అఖిలేష్ స్పందిస్తూ ప్రజలు తమ ఆఖరి రోజుల్లో బెనారస్‌ను సందర్శిస్తారని అఖిలేష్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే బీజేపీకి రోజులు దగ్గరపడ్డాయనే ఉద్దేశంతోనే తాను ఈ వ్యాఖ్యలు చేశానని ఆయన వివరణ ఇచ్చారు. అయితే అఖఙలేష్ వ్యాఖ్యలపై బిజెపి ఘాటుగనే స్పందించింది.