అఖిల భారత చదరంగ చిత్రమాల ప్రదర్శన ప్రారంభం

ఖమ్మం క్రీడలు : నింజోవిచ్‌ చెన్‌ అకాడమీ హైదరాబాద్‌ , రెజోనెన్స్‌ విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన అఖిల భారత చదరంగ చిత్రమాల ప్రదర్శన ఆదివారం ఖమ్మం రెజోనెన్స్‌ ఇన్ఫో పాఠశాలలో ప్రారంభమైంది. కార్యక్రమానికి ఉపసభాపతి మల్లు భట్టివిక్రమార్కు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రదర్శనను ప్రారంభించారు. జూన్‌ రెండు వరకు అందుబాటులో ఉండే ఈ ప్రదర్శనలో దేశవి దేశాలనుంచి సేకరించిన చదరంగ చరిత్రను వివరించే చిత్రాలను ప్రదర్శిస్తున్నారు.