అగ్నిప్రమాదంలో మహిళ మృతి

బైంసా: పట్టణంలోని బట్టిగల్లిలో జరిగిన అగ్నిప్రమాదంలో మహిళ మృతి చెందారు. బటిగలిలోని అష్వాక్‌, జరీనాభాను తమ కుమారుడితో కలిసి ఇంటో ఉండగా విద్యుత్తు లేకపోవడంతో క్యాండిల్‌ వెలిగించుకున్నారు. రాత్రి 2గంటల సమయంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో అష్వాక్‌, చిన్నకుమారుడు షేక్‌ రజీ గోడ పగులగొట్టుకొని బయటకు వచ్చారు. దీనిని గమనించిన స్థానికులు పట్టణపోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్సై చేరుకోగా అక్కడ అష్వాక్‌ భార్య జరీనా మృతి చెందింది.