అగ్ని ప్రమాదంతో కాలిపోయిన ఇల్లు
పరిశీలించిన రెవెన్యూ అధికారులు
కొత్తగూడ ఆగస్టు 28 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని దుర్గారం గ్రామంలో దబ్బటి రమేష్ తండ్రి పున్నం నివాసగృహం శనివారం రాత్రి కరెంటు షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగి పూర్తిగా కాలిపోవడం జరిగింది.వెంటనే స్పందించి రెవెన్యూ అధికారులు ఇంటి ని పరిశీలించారు.తాసిల్దార్ చందా నరేష్ మాట్లాడుతూ ఇంటి విలువ మొత్తం సామాన్లతో కలిపి 2,39,100 రూపాయలు కలదు.పంచనామా నిర్వహించి మహబూబాద్ జిల్లా కలెక్టర్ శశాంక కు నివేదిక పంపడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.