అగ్ని ప్రమాదంలో రూ.50వేల ఆస్తి నష్టం

కాగజ్‌నగర్‌ గ్రామీణం: మండలంలోని నజ్రూర్‌నగర్‌ మార్కెట్‌ ఏరియాలోని షెమిరన్‌ మందుల గోదాములో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు రూ.50వేల ఆస్తి నష్టం వాటిల్లినట్లు వీఆర్‌వో రాజమణి తెలిపారు. నాయకులు బుచ్చిలింగం, కిషోర్‌ కౌర్‌, రాకేష్‌, వాసుదేవ్‌లు ఆదివారం సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలను తెలుసుకున్నారు.