అగ్నీపథ్ స్కిమ్ తక్షణమే రద్దు చెయ్యాలి

మరణించిన రాకేష్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
 -సిపిఎం కరిమాబాద్ ఏరియా కమిటీ డిమాండ్
వరంగల్ ఈస్ట్,జూన్ 18(జనం సాక్షి):
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపత్ స్కీమ్ను వెంటనే రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముక్కెర రామస్వామి  డిమాండ్ చేశారు శనివారం నగరంలోని కరీమాబాద్ లో వద్ద
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపద్ పధకాన్ని
నిరసిస్తూ నిన్న సికింద్రాబాద్ లో జరిగినటువంటి కాల్పులను నిరసిస్తూ  ధర్నా కార్యక్రమం నిర్వహించారు సికింద్రాబాద్ కాల్పుల్లో మరణించిన రాకేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఈ సందర్భంగా రామస్వామి  డిమాండ్ చేశారు విద్యార్థి మృతికి కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రధాన మంత్రి మోడీ బాధ్యత వహించాలని తక్షణమే రాజీనామా చేయాలని   సిపిఎం పార్టీ గా డిమాండ్   చేస్తున్నామన్నారు    ..కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపద్ పథకాన్ని వలన ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి కుంటూ ఉద్యోగం సంపాదించాలనే ఆలోచన ఉన్న అభ్యర్థులకు నష్టం కలిగే పద్ధతుల్లో ఈ చట్టం ఉందని అన్నారు 17 సంవత్సరాలు ఉన్న ఉద్యోగాన్ని  వారికి నాలుగు సంవత్సరాలకు కుదించి ఆర్మీ అభ్యర్థులకు రావాల్సిన పెన్షన్ విధానాన్ని ఇతర బెన్ఫిట్స్ ని ఇవ్వకుండా చేయడం కోసం కుట్ర చేస్తూ 17 సంవత్సరాల విధానాన్ని తగ్గించడం అనేది మోడీ ప్రభుత్వం దివాలా కోరుతనానికి నిదర్శనం అని అన్నారు.. పైగా విద్యార్థులు నిరసన చేస్తున్న నిరసనకారులపై  ఒక నిండు ప్రాణాన్ని తీసినటువంటి మోడీ ప్రభుత్వం గద్దె దిగాలని అన్నారు, ఒకవైపు దేశ రక్షణ కోసం రక్షణగా నిలబడి ఎటువంటి ఆర్మీ సైనికులకు కూడా రక్షణ లేకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో .గున్నాల ప్రభాకర్ ,ఎండి కరీం ,అప్పజి, శ్రీవాణి ,జయరాం ,రాము, ఎండి. సలీమ్, పాషా ,అనీల్ ,ఎండి బేగం  దివ్య  అనిత   చందా యాకమ్మ, ఎల్లమ్మ, వంశీ  నరేష్  అజేయి  సాధనoధం ,రంజాన్ , రాజు  కుమార్  పార్వతి, స్వరూప ,రమ్య తదితరులు పాల్గొన్నారు