అఘాయిత్యాలపై 8న రాష్ట్రస్థాయి సదస్సు

జస్టిన్‌ రమణ, జస్టిన్‌ రోహిణి వెల్లడి

సికింద్రాబాద్‌: మహిళలపై అత్యాచార కేసుల విచారణకు రాష్ట్రంలో సైతం సత్వర విచారణ న్యాయ స్థానాల (ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల)ను ఏర్పాటు చేయాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్‌ జ్యూడిషియల్‌ అకాడమీ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్‌ ఎన్‌.వి.రమణ  సూచించారు. జిల్లాల స్థాయిలోనూ ‘ పర్యవేక్షక కమిటీ’ల ఏర్పాటును పరిశీలించాల్సి ఉందన్నారు. ఢిల్లీలో వైద్య విద్యార్ధినిపై సామూహిక అత్యాచార ఘటన నేపథ్యంలో చట్టాలో చేపట్లాల్సిన మార్పులు సమాజంలో చైతన్యం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌ జూడ్యిషియల్‌ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో ఈ నెల 8న ఓ కీలక సదస్సును నిర్వహించనున్నామని వెల్లడించారు.  ‘ మహిళలపై అఘాయిత్యాలు- చట్ట సవరణలు ‘ అనే అంశంపై ఈ సదస్సు ఉంటుందన్నారు. అకాడమీ ప్రాంగణంలో పాలక మండలి సభ్యురాలు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్‌ రోహిణితో కలిసి విలేకరుల సమావేశంలో జస్టిన్‌ రమణ మాట్లాడుతూ.. ఢిల్లీ ఘటనలాంటివి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై జస్టిన్‌వర్మ నేతృత్వంలో కేంద్రస్థాయిలో ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేసినందున, ఆ కమిటీకీ రాష్ట్రం నుంచి తమ వంతు సలహా సూచనలను అందించేందుకు సదస్సు నిర్వహించనున్నట్లు తెలియజేశారు.