అజయ్‌కు అవార్డుపై కాజోల్ ఆనందం
68వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటనలో బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ ఉత్తమ నటుడిగా ఎంపిక కావడంపై ఆయన భార్య, నటి కాజోల్ స్పందించారు. టీమ్ తాన్హాజీ 3 జాతీయ అవార్డులను గెలుచుకుంది. చాలా సంతోషంగా, గర్వంగా ఉంది! అంటూ సోషల్ విూడియా వేదికగా ఓ ఫొటోను జతచేస్తూ.. తన అభిప్రాయాన్ని పంచుకుంది. ఈ చిత్రంలో సావిత్రి బాయి పాత్రను పోషించిన కాజోల్… ఈ నోట్‌తో పాటు, ఆ సినిమా సెట్స్ నుండి త్రోబాక్ స్నాప్‌ను కూడా పోస్ట్ చేసింది. ఈ చిత్రం ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమాగా నిలిచి, సంపూర్ణ వినోదాన్ని అందించిందని చెప్తూ.. ఉత్తమ కాస్ట్యూమర్ గా నిలిచిన నచికేత్ బార్వేను ట్యాగ్ చేసింది. ది అన్‌సంగ్ వారియర్‌లో తన పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ అద్భుత నటన కనబరిచారు. అజయ్ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకోవడంతో అతని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టాప్ లారెల్‌ను కైవసం చేసుకున్నందుకు వారు అతనికి శుభాకాంక్షలతో ముంచెత్తారు. జనవరి 2020లో విడుదలైన తాన్హాజీ, 68వ జాతీయ అవార్డులలో సంపూర్ణ వినోదం, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్‌ని అందించిన అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా కూడా నిలిచింది. మొత్తం మూడు అవార్డులను ª`లకెయిమ్ చేస్తూ ఈ పీరియాడికల్ డ్రామా అవార్డుల వేడుకలో మెరిసింది.