అజహర్ అలీ అరుదైన ఘనత
మెల్బోర్న్: పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ అజహర్ అలీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో వెయ్యి పరుగులను పూర్తి చేసిన ఐదో పాక్ ఆటగాడిగా నిలిచాడు.తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండోటెస్టులో అజహర్ ఆ మార్కును చేరాడు. అంతకుముందు మోసిన్ ఖాన్, ఇంజమామ్ వుల్ హక్, యూసఫ్, యూనిస్ ఖాన్లు ఒక క్యాలెండర్ ఇయర్ లో వెయ్యి పరుగులు చేసిన ఆటగాళ్లు. ఇందులో యూనిస్ ఖాన్ రెండుసార్లు వెయ్యి పరుగులను పూర్తి చేశాడు.
ఆస్ట్రేలియాతో టెస్టులో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్ తొలిరోజు పదే పదే వర్షం పడటంతో 50.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ నాలుగు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది.సమీ అస్లామ్(9), బాబర్ అజమ్(23) యూనిస్ ఖాన్(21), మిస్బావుల్ హక్(11) లు పెవిలియన్ కు చేరారు. క్రీజ్లో అజహర్ అలీ(66 బ్యాటింగ్), అసద్ షఫిక్(8 బ్యాటింగ్)లు ఉన్నారు.