అటవీహక్కు పత్రాలు పంపిణీ కార్యాక్రమంలో గిరిజన సంఘం నాయకుల ఆందోళన
కారేపల్లి (జనంసాక్షి): మండలంలోని ఛీమలపాడు అటవీ ప్రాతంలో పొడు భూమి చేసుకోని జీవిస్తున్న గిరిజన రైతులకు సోమవారం మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అటవీహక్కు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. 2005లో యూపీఏ-1 ప్రభుత్వం గిరిజనులకు అటవీహక్కు చట్టాన్నీ తీసుకువస్తే 2007 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దానిని అమలు చేస్తూ భద్రాచలంలో గిరిజనులను అటవీహక్కు పత్రాలు పంపిణీ చకేశారని అన్నారు. మంత్రి ప్రసంగిస్తుండగానే గిరిజన సంఘం నాయకులు పెద్ద ఎత్తున ఆందోళణ చేపట్టారు. అందరికి హక్కు పంపిణీ చేయాలని అడ్డుకున్నారు. 1376 మందికి హక్కు పత్రాలు అందిచాల్సి ఉండగా కేవలం 464 మందికి మాత్రమే ఇవ్వడం పట్ల గిరిజన సంఘం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు యత్నించవద్దని అన్నారు. అనంతరం ఆయన పెండింగ్‌లో ఉన్న హక్కు పత్రాల గురించి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి త్వరగా వాటిని పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ అందోళనలో గిరిజన సంఘం నాయకులు గుగులోతు ధర్మానాయక్, భూక్యా వీరభద్రం నాయక్, కిషోర్, సీపీఎం నాయకులు బొంతు రాంబాబులు పాల్గొన్నారు. తొలుత మంత్రి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఎస్‌ఆర్‌ఈజీఎస్ నిధులు రూ.50 లక్షలతో ముత్యాలగూడెం కట్టువాగుపై బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన ,ఏశారు. అలాగే చీమలపాడు, గాంధీనగరంలో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రన్ని, కారేపల్లి స్త్రీశక్తి భవానాలను అయన ప్రారంభించారు. కారేపల్లి భారత్ నగర్ కాలనీలోని ఏఆర్‌డబ్ల్యూఎస్ నిధులు రూ. 13 లక్షలతో నిర్మించిన వాటర్‌ఓవర్ హెడ్ ట్యాంక్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో మండల ప్రత్యేకాధికారి సువ్బారాయుడు, తహశీల్ధార్ నాగుబాబు, ఎంపీడీఓ పి అల్బర్ట్, కారేపల్లి, పేరేపల్లి సోసైటీల ఛైర్మన్‌ల ఈసాల నాగేశ్వరరావు, రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ సామకులు పూనెం రాజు, తోటకూరి పిచ్చయ్య, పర్సా పట్టాభిరామారావు, నర్సింగ్ శ్రీనివాసారావు, భద్దూలాల్, మేదరి వెంకటేశ్వర్లు, కొనకండ్ల సత్యనారయణ, తోటకూరి రాంబాబు పాల్గొన్నారు.