అటవీ హక్కుల చట్టాన్ని పక్కన పెట్టి పోడు భూములకు పట్టాలెలా యిస్తారు?
సిపిఐ (ఎంఎల్ ) జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య
కేసముద్రం సెప్టెంబర్ 21 జనం సాక్షి / అటవీ హక్కుల చట్టాన్ని యధావిధిగా అమలు చేయకుండా మంత్రులు, ప్రజాప్రతినిధులకు పోడు పట్టాల జారి బాధ్యతను అప్పగించటం చట్టం నిబందనలకు తూట్లు పొడిచి అధికార దుర్విని యోగానికి పాల్పడడమేనని సిపిఐ (ఎమ్మెల్)న్యూ డెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య అన్నారు.బుధవారం కేసముద్రంలో జరిగిన తొర్రూరు,కేసముద్రం సబ్ డివిజన్ స్థాయి ముఖ్య కార్యకర్తల సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రసంగిస్తూ చట్టంలో ఎలాంటి పాత్ర లేని ప్రజాప్రతినిధులకు కెసిఆర్ విశేష అధికారాలు కల్పించి పోడు పట్టాల బాధ్యత వారికి అప్పగించటం అధికార దుర్వినియోగానికి పాల్పడటమే అన్నారు.ఇన్ చార్జ్ మంత్రి కన్వీనర్ గా జిల్లా అధికారులతో ఎంపీ ,ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ , జిల్లా పరిషత్ చైర్మన్లను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించటం రాజకీయ దురుద్దేశంతో చేసిందేనన్నారు.
ఇప్పటికే గ్రామాలలో అధికార పార్టీ కార్యకర్తలు పోడు పట్టాల పైరవీ దందాలకు తెరలేపారని, గిరిజన ఆదివాసీల నుండి పట్టాలిస్తామని రేట్లు నిర్ణయించి వసూళ్లకు పాల్పడు తున్నారని ఆయన ఆరోపించారు.
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన విధివిధానాలలో అటవీ హక్కుల కమిటీల అధికారాలను తగ్గించి ఫారెస్ట్ అధికారులకే పట్టాల జారీ అధికారం కట్ట బెట్టారన్నారు. గ్రామ సభల తీర్మాణాలపై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్దే తుది నిర్ణయమని, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ఆధారంగా గుర్తిస్తారని ప్రకటించటం విడ్డూరంగా వుందన్నారు.అటవీ హక్కుల చట్టం ఆధారాలుగా పేర్కొన్న 13 అంశాలలో గూగుల్ మ్యాప్, ఛాయా చిత్రాల అంశం లేదని, చట్టంలో లేని అంశాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం కీలకం చేసి అర్హులైన గిరిజనులకు అన్యాయం చేయ చూస్తున్నదన్నారు.చట్టాన్ని యధాతధంగా అమలుచేసి అర్హులైన గిరిజన ఆదివాసీల పోడు భూములకు పట్టాలివ్వాలని లేనట్లయితే రాష్ట్ర ప్రభుత్వ పక్షపాతానికి, అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష ఆందోళనకు పూనుకొంటామని ఆయన హెచ్చరించారు.
సిపిఐ (ఎంఎల్ )న్యూడెమోసీ జిల్లా నాయకులు శివారపు శ్రీధర్ అద్యక్షతన జరిగిన ఈ జనరల్ బాడీలో పార్టీ ఏరియా కమిటీ నాయకులు జె. సీతారామయ్య, పార్టీ జిల్లా నాయకులు దేశెట్టి రామచంద్రయ్య, గుజ్జు దేవేందర్లు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం,తొర్రూరు సబ్ డివిజన్ నాయకులు కొట్టం అంజన్న,చిర్ర యాకయ్య,జక్కుల కొమురక్క, బట్టు నాగేశ్వరరావు, మదార్,రాకేష్,తొట్టి హరీష్, సహజన్ పాషా, యడ్ల మల్లయ్య అరుణోదయ జిల్లా కార్యదర్శి చారి హరీష్ ,పి డి ఎస్ యు జిల్లా నాయకులు మాదారపు నాగరాజు,ఎనపల్లి నవీన్ బట్ట మెకల రాజు,మిట్టగడుపుల వేంకన్న, మల్లయ్య, మాంకాళీ కృష్ణ,మడుపు వెంకటాచారి, సకినాల ఐలయ్య, హతరాం, మునిగంటి సుధాకర్ తదితరులు పాల్గున్నారు.
Attachments area