అట్టహాసంగా ఎస్‌ఐల పాసింగ్ ఔట్ పరేడ్
ఒకే దఫాలో శిక్షణ పూర్తి చేసుకున్న 65మంది మహిళా ఎస్సైలు
అనంతపురం,జూన్20(జనం సాక్షి ): అనంతపురం పట్టణంలో నూతన ఎస్సైల పాసింగ్ ఔట్ పరేడ్ అట్టహాసంగా జరిగింది. 2017 సంవత్సరంలో ఎంపికైన 652 ఎస్సైలు నగరంలోని పోలీస్ శిక్షణ కళాశాలలో ఏడాది పాటు శిక్షణా కాలం పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా నగరంలోని పీటీసీ పరేడ్ మైదానంలో బుధవారం పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ¬ంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, డీజీపీ మాలకొండయ్యలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నూతన ఎస్సైల నుంచి ¬ంమంత్రి, డీజీపీ గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. 652మందిలో 165మంది మహిళా ఎస్సైలు ఉన్నారు. రాష్ట్రంలో ఇంత మంది మహిళా ఎస్సైలు ఒకే బ్యాచ్‌లో రావడం ఇదే తొలిసారి. వీరంతా వివిధ విభాగాల్లో క్షేత్రస్థాయిలో శిక్షణ పొందనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, కలెక్టర్, ఎస్పీలతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాలకొండయ్య మాట్లాడుతూ.. ఎస్సైలుగా బాధ్యతలు స్వీకరించిన తరువాత నేరాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కేసులపై శ్రద్దతో ముందుకు సాగాలన్నరు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు.