అట్రాసిటీ కేసుపై ఏసీపీ విచారణ.
: విచారణ చేస్తున్న ఏసీపీ.
నెన్నెల, అక్టోబర్1,(జనంసాక్షి) నెన్నెల మండలం బొప్పరం గ్రామంలో అట్రాసిటీ కేసు విచారణ కు బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. బొప్పరం గ్రామానికి చెందిన గంగం భారతమ్మ వద్ద పాలేరుగా పని చేస్తున్న నాయిని సురేందర్ అనే వ్యక్తిని ఆటోలో వస్తుండగా కర్ణేకొండ పద్మ, చంద్రశేఖర్ అనే వ్యక్తులు దారి మధ్యలో ఆటకాయించి కులం పేరుతో దూషించారని పిర్యాదు చేయగా గత నెల 15న కేసు నమోదు చేసి ఈరోజు విచారణ చేపట్టినట్టు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఘటన స్థలాన్ని సందర్శించి సాక్షులతో మాట్లాడి వివరాలు రాబట్టుకున్నట్లు ఆయన వివరించారు. ఆయన వెంట బెల్లంపల్లి రూరల్ సీఐ బాబూరావు, పోలీసు సిబ్బంది ఉన్నారు.