అడ్డగుట్టలో అక్రమ షెడ్
పుట్టగొడుగుల్లా పుట్టుకోస్తున్న అక్రమ షెడ్లు
*అక్రమ షెడ్లకు అనుమాతులేవి..?
*ఇష్టానుసారంగగా వ్యవహారిస్తున్న అక్రమ షెడ్ ఓనర్స్
*పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికారులు..
*అమాయక ప్రజలపైనే మీ ప్రతాపమా..?
*మీకు దమ్ముంటే చెర్యలు తీసుకోండి.కూకట్ పల్లి నవంబర్ 03( జనంసాక్షి ):
అక్రమ షెడ్ నిర్మాణాలకు కూకట్ పల్లి సర్కిల్ హైదర్ నగర్ డివిజన్ అడ్డాగా మారింది. అడిగే వారు లేక అక్రమ షెడ్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో అక్రమార్కుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి.అక్రమ నిర్మాణాలు జరగకుండా చూసుకోవాల్సిన అధికారులు కాసులకు కక్కుర్తి పడి అక్రమ షెడ్లకు ఆజ్యం పోస్తున్నారు.డివిజన్ పరిధిలోని అడ్డగుట్ట ఐసిఐసి బ్యాంక్ వెనుక భాగంలో ఎలాంటి అనుమతి లేకుండా భారీ అక్రమ షెడ్డు నిర్మాణం జరుగుతున్నప్పటికీ అధికారుల మౌనం పై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా రిషి కాలేజ్ సమీపంలోని ఓ భారీ షెడ్ నాలాను సైతం కబ్జా చేసి యదేచ్చగా అక్రమ షెడ్డును నిర్మిస్తున్నప్పటికీ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.అధికారులు సామాన్యుల ఇళ్ల నిర్మాణాలను కూల్చేస్తున్నారు కానీ, డబ్బు, అధికార బలం ఉన్న నిర్మాణాదారుల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను కూల్చివేసి, నిర్మాణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు