అడ్డగోలుగా రామానుజాపూర్ గ్రామ పంచాయతీ వ్యవస్థ

గ్రామ ప్రజల సమస్యలను గాలికి వదిలేసిన గ్రామ సర్పంచ్,పంచాయతీ కార్యదర్శి
వెంకటాపూర్ (రామప్ప)అక్టోబర్18(జనం సాక్షి):-
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామానుజపురం గ్రామ పంచాయతీ వ్యవస్థ అడ్డగోలుగా ఉంది.ఇంట్లోకి వర్షపు వరద వస్తుందని పలుమార్లు గ్రామ సర్పంచ్ కి తెలియపరిచిన గ్రామ సమస్యలను గాలికి వదిలేసి అంటి ముట్టనట్టు గా గ్రామ సర్పంచ్ తుమ్మేటి రాజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి వ్యవహరిస్తున్నారు. వివరాల్లోకి వెళితే రామానుజపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గుంటూరుపల్లి పరిధిలో మెయిన్ రోడ్డు ప్రక్కన కలిగిన నివాసాలలోకి నాలుగు వాడల నుంచి వరద నీరు వచ్చి ఇళ్లలోకి చేరి ఇబ్బందుల పాలవుతున్నారు.ఈ విషయమై పలుమార్లు సర్పంచికి తెలియపరిచిన కూడా పట్టించుకోవడం లేదు కావున ఉన్నతాధికారులు గమనించి తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
Attachments area