అథ్లెటిక్స్‌లో పతకంపై ఆశలు
డిస్కస్‌త్రో పైనల్‌కు చేరిన పూనియా
లండన్, ఆగస్టు 4: లండన్ ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫిల్డ్‌లో భారత్‌కు పతకం ఆశలు సజీంగా ఉన్నాయి. మహిళల డిస్కస్ త్రోలో భారత అథ్లెట్ కృస్ణ పూనియా పైనల్‌కు అర్హత సాధించింది. అథ్లెటిక్స్‌లో ఓ మోస్తారు అంచనాల మధ్య బరిలోకి దిగిన పూనియా క్వాలిఫికేషన్ రౌండ్‌లో మంచి ప్రదర్శన కనబరిచింది. గ్రూప్ ఎలో చోటు దక్కించుకున్న ఈ భారత అథ్లెట్ ఒక కిలో బరువునన డిస్కస్‌ను 63.54 మీటర్ల దూరం విసిరింది. ఫైనల్ రౌండ్‌కు చేరాలంటే కావాల్సిన 63 మీటర్ల కంటే0.54 మీటర్లు క్కువే ఆమె విసిరింది. గ్రూప్‌లో ఐదో స్థానంలోనూ, ఓవరాల్‌గా ఎనిమిదో స్థానంలోనూ నిలిచింది. అయితే ఈ సిజన్‌లో పూనియా అత్యుత్తమ ప్రదర్శన 64.76 మీటర్లు అందుకోలేకపోయింది. బీజింగ్ ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ బారిస్ 65.94 మీటర్లు, రష్యాకు చెందిన పిష్చనికోవా 65.02 మీటర్లు, డిఫెండింగ్ ఛాంపియన్ యాన్‌సింగ్ 64,68 మీటర్లు నమోదు చేశారు. కాగా ఫైనల్‌కు అర్హత సాదించిన తొలి భారతీయ డిస్కస్ త్రో క్రీడాకారిణిగా పూనియా రికార్డులకెక్కింది. అలాగే ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌లో పతకం కోసం క్వాలిఫై అయిన మరో భారత అథ్లెట్‌గా కూడా ఘనత సాదించిది.