అదాని పోర్ట్ విస్తరణ తో కాలుష్యం.

అదాని పోర్ట్ విస్తరణ తో కాలుష్యం

జన విజ్ఞాన వేదిక విశాఖపట్నం జిల్లా పర్యావరణ కమిటీ
గడిసిన 15 ఏళ్లులో గంగవరం (అదాని) పోర్టు విస్తరణ లో భాగంగా బెర్తలు పెంచుకుంటూపోతుంటే ఓపెన్ కోల్ యార్డ్,ఐరన్ ఓర్ యార్డ్ ఇతర రసాయాలతో వచ్చే దుమ్ము, ధూళితో కూడిన కాలుష్యంతో 64, 65, 66,67 74, 75 వార్డుల (గంగవరం, పెదగంట్యాడ, గాజువాక) పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు.పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(PCB) అధికారులు, స్థానిక శాసన సభ్యులు మేల్కొని ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఈ కాలుష్యాన్ని నిర్మూలించడానికి తగు చర్యలు ప్రధానంగా జీవీఎంసీ అధికారులు చేపట్టాలని జన విజ్ఞాన వేదిక విశాఖపట్నం పర్యావరణ కమిటీ సభ్యులు డాక్టర్ లక్ష్మణస్వామి పాలూరు, డాక్టర్ ఎం. రమేష్ కుమార్ మరియు ప్రసాదరావు* లు పత్రికా ముఖంగా తెలియజేయడమైనది.