అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న ఆటో

నలుగురికి తీవ్రగాయాలు
ఎల్లారెడ్డిపేట, జనంసాక్షి: మండలంలోని వీర్ణపల్లి వద్ద ఓ ఆటో ఈదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన గజ్జెల కాశవ్వ, దేవరాజు, తిరుపతి, స్వామిలను కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.