అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా
బాలుడి మృతి
ముగ్గురికి గాయాలు
కమాన్‌పూర్, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలంలోని పేరేపల్లి నుంచి రొంపికుంట గ్రామానికి వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, ముగ్గురికి తీవ్రగాలయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పేరేపల్లి గ్రామానికి చెందిన గుర్రాల సంజీవ్ (16), కలవేన శ్రీనివాస్ (12), కలవేన రమేశ్(14), సిద్ధం మారుతి (10)లు ట్రాక్టర్‌లో వెళ్తున్నారు. ట్రాక్టర్ బోల్తా పడటంతో గుర్రాల సంజీవ్ అక్కడిక్కడే మృతిచెందాడు. కలవేన రమేశ్‌కు ఎడమకాలు విరిగింది. శ్రీనివాస్, మారుతిల పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు పెదపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.