అదుపుతప్పి లారీ బోల్తా…తప్పిన పెను ప్రమాదం

•లారీ ఆఫీస్ సమీపంలో ఉన్న గుంతలే ప్రమాదానికి కారణం
•ఎన్ని ప్రమాదాలు జరిగినా బయ్యారం రహదారిపై వీడని గ్రహణం
బయ్యారం,సెప్టెంబర్29(జనంసాక్షి):
బయ్యారం…పేరుకి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం మాత్రమే.కానీ బయ్యారంలో రహదారి మాత్రం తీవ్ర ప్రమాదకరం.బయ్యారం నుండి మహబూబాబాద్ వెళ్ళే ప్రధాన రహదారి బయ్యారం లారీ ఆఫీస్ సమీపంలో గుంతలు కారణంగా నిత్యం వాహన ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.ఇదే క్రమంలో
బయ్యారం నుండి మహబూబాబాద్ వెళ్లే రహదారిలో బుదవారం రాత్రి ఇల్లందు నుండి భూపాలపల్లి వెళ్లే బొగ్గు లారీ రహదారి మీద గుంతలను తప్పించబోయి బోల్తా పడింది. అదృష్టవశాత్తు ప్రమాదంలో ఏ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.గతంలో పలుమార్లు జనంసాక్షి వరుస కథనాలతో తాత్కాలిక మరమ్మతులతో చేతులు దులుపుకున్నారని,ఒక వైపు రహదారి గుంతలు,మరోవైపు రహదారి ప్రక్కనే పెద్ద పెద్ద గోయ్యిలు ఉండడంతో నిత్యం ప్రమాదాలు చేసుకుంటున్నా అటు అధికారులు,ఇటు ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.నిత్యం ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా బయ్యారం ప్రధాన రహదారిపై సందిగ్ధం అలాగే ఉంటుంది.ప్రపోజ్డ్ నేషనల్ హైవే నెపంతో రహదారి శాశ్వత మరమ్మతులు చేపట్టలేదు. హైవే మాట అటుంచితే ఇంకా ఈ ప్రాంతంలో ఎన్ని ప్రమాదాలు చూడల్సివస్తుందో అని స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.