అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా: 5గురుకి గాయాలు
నిర్మల్, జనంసాక్షి: పట్టణంలోని బుధవారంపేటలో ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టరు వెనుక టైరు ఊడిపోవడంతో అదుపు తప్పి బోల్తా పడింది. సంఘటనలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న చిన్నయ్య, హుస్సేన్‌లతో పాటు ఎదురుగా ద్విచక్రవాహనంపై వస్తున్న కృష్ణచైతన్య దంపతులు, లక్షి అనే మహిళ గాయపడ్డారు. ఎస్సై శాంతారాం సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదవివరాలను తెలుసుకున్నారు.



