అదే తీరు.. మారని అధికారులు

కుక్కలు కరుస్తున్నా కనికరం లేదా..?
బోడుప్పల్ లో మరో చిన్నారిపై కాటు
“జనంసాక్షి” హెచ్చరించినా చెవికెక్కించుకోని యంత్రాంగం
మేడిపల్లి – జనంసాక్షి
ఒకవైపు కాలనీవాసులు ఫిర్యాదు చేయడం, “జనంసాక్షి” పదేపదే హెచ్చరించడం, అయినా అధికారులు పెడచెవిన పెట్టడం వల్ల బోడుప్పల్ లో కుక్కలు మరోసారి దాడికి పాల్పడ్డాయి. బడికి వెళ్తున్న ఓ చిన్నారిపై దాడి చేసి గాయపరిచాయి. ఒక్కసారిగా కుక్కలు మీద పడటంతో బాలుడు నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ పరిధిలో శనివారం ఉదయం ఈ ఘటన స్థానికులను కలచివేసింది. పిట్టల బస్తిలో ఓ చిన్నపిల్లవాడు రోజులాగే ఉదయం బడికి బయలుదేరగా.. ఒక్కసారిగా వీది కుక్కలు అతనిపై దాడి చేశాయి. దీంతో బాలుడి చేతికి గాయమైంది. ఘటనతో తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. వీది కుక్కలు, పందుల వల్ల గతంలో సైతం ఇలాంటి ఘటనలు ఎన్నోసార్లు జరిగినా.. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, కమీషనర్, శానిటేషను సిబ్బంది దృష్టికి తీసుకుపోయినా చర్యలు తీసుకున్న పాపనపోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మేమేం చేసేది..?
గత కొంతకాలంగా కుక్కల వల్ల జరుగుతున్న సమస్యలను “జనంసాక్షి” ఎప్పటికప్పుడు ప్రచురిస్తున్నా పాలకవర్గం సహా అధికారుల్లో కదలిక లేకపోయింది. ఈ విషయమై తాజాగా ఓ అధికారితో ఫోన్లో మాట్లాడగా.. “కొత్త చట్టం ప్రకారం కుక్కలను పట్టడం కూడా ఇబ్బందిగా మారింది. వాటిని పడితే బ్లూ క్రాస్ వాళ్ళు నేరుగా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిస్తున్నారు. అధికారుల మీదనే కేసు చేస్తే ఇంకా మేమేం చేయగలం? ఆపరేషన్లు చేసి వదిలేయడం తప్ప కుక్కలను ఏం చేయలేం” అని సమాధానం ఇచ్చారు.
Attachments area