అద్వానీ రాజీనామా ఆ పార్టీ అంతర్గత వ్యవహారం: చంద్రబాబు

హైదరాబాద్‌,(జనంసాక్షి): అద్వానీ రాజీనామా ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. నరేంద్రమోడీ ప్రభావం మన రాష్ట్రంలో ఏ మాత్రం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో తెదేపా అమలుచేసిన అభివృధ్ది కార్యక్రమాలనే మోడీ గుజరాత్‌aలలో అమలుచేశారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడుతుందని, భాజపా పుంజుకొని స్థితిలో లేదని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టేందుకు తాము సిద్ధమన్న చంద్రబాబు కొన్ని పార్టీల ప్యాకేజీలు, స్వప్రయోజనాల కోసం పెట్టబోమని స్పష్టం చేశారు.