అధికారంలోకి రాగానే మెరుగైన రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తాం

 *గండ్ర సత్యనారాయణ రావు. చిట్యాల3( జనం సాక్షి)  కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే రాష్ట్రంలో మెరుగైన రెవెన్యూ వ్యవస్థను తీసుకొచ్చి ధరణి పోర్టల్ ను పూర్తిగా రద్దు చేస్తామని భూపాలపల్లి నిజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జి గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.
ఆదివారం మండలంలోని  గోపాలపురం, కొత్తపేట, జడల్ పేట, భీష్మ నగర్, బావుసింగ్ పల్లి, ఒడితల గ్రామాల్లో మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన రైతు డిక్లరేషన్ రచ్చబండ కార్యక్రమంలో  నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు అయిత ప్రకాష్ రెడ్డి  వివిధ గ్రామాల్లో జరిగిన రచ్చ బండ కార్యక్రమాల్లో  పాల్గొన్నారు. అనంతరం వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం దొరల చేతిలో బందీగా మారిందన్నారు. రెండు సార్లు అధికారం చేపట్టి ప్రజలకు చేసిందేమీ లేదని, నాలుగైదేళ్లు గడుస్తున్నా, అర్హులకు కొత్త ఫించన్లు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. సాగు భూములను సైతం బీడు భూములుగా మార్చిన పాపం ఊరికే పొదని, రైతన్నల ఉసురు తగులుతుందని అన్నారు. రైతు కూలీలకు, భూమిలేని రైతులకు భీమా, ఉపాధి హామీ పథకానికి వ్యవసాయాన్ని అనుబంధం చేస్తామ‌న్నారు. అంతేకాకుండా, మెరుగైన రెవెన్యూ వ్యవస్థను తీసుకోస్తామ‌న్నారు. రాబోయే  కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే భూపాలపల్లి ప్రజలకు సేవ చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి, మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య, చింతకుంట రామయ్యపల్లి సర్పంచ్ ముకిరాల మధువంశీ, మూల శంకర్ గౌండ్, బానోత్ శ్రీనివాస్ నాయక్, గజ్జి రవి, ఎర్రవెల్లి భద్రయ్య, బండి భగవాన్, బొట్ల రవి, నంద రాజునాయక్,  ఎండీ రుక్మోద్దిన్, రత్న అంకుస్, దొడ్ల రాజిరెడ్డి, కర్రు ప్రతాప్ రెడ్డి, సదయ్య, తిరుపతి రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు