అధికారులపై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలి.

ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్యాంసుందర్.
తాండూర్ సెప్టెంబర్ 23 (జనంసాక్షి) కార్పెంటర్ల సంఘం అధ్యక్షుడు ఇర్షాద్ తమపై చేసిన ఆరోపణలు అవాస్తవమని చట్టప్రకారం అనుమతులు లేకుంటే దాడులను చేస్తామని తాండూరు ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్యాంసుందర్ పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 69 పై కార్పెంటర్లకు అవగాహన కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. కార్పెంటర్ సంఘం ఆధ్వర్యంలో తమ అనుమతి లేకుండా తమ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారని ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈర్షద్ అనే వ్యక్తి అక్రమ కలప కలిగి ఉన్నాడని అందుకే మాపై అనవసర ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. అక్రమ కలప కలిగి ఉంటే దాడులను ముమ్మర చేస్తామని హెచ్చరించారు. అనవసరమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ రేంజ్ అధికారి నాగజ్యోతి సిబ్బంది ఉన్నారు.