అధికారుల చేతికి చిక్కిన అక్రమంగా తరలిస్తున్న కలప
బెల్లంపల్లి పట్టణం : గోలేటి నుంచి బెల్లంపల్లి వైపునకు ఈ రోజు తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న కలపను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. డీఎఫ్‌వో కమలాకర్‌కు అందిన సమాచారం మేరకు నిఘావిభాగం ఇన్‌ఛార్జి ప్రభాకరరావు సిబ్బందితో కలిసి గోలేటి క్రాస్‌రోడ్డు వద్ద మాటువేసి పట్టుకున్నారు. 9టేకు దుంగలతోపాటు, కలపను తరలిస్తున్న టాటా సుమోను సీజ్ చేశారు.కలప విలువ సుమారు రూ. 15వేలు ఉంటుందని అధికారులు తెలిపారు.