అధికారుల నిర్బంధం
పెద్దపల్లి: మండంలోని నిట్టూరులో గత మూడు నెలలుగా తాగునీటి సరఫరా నిలిచిపోవండంతో గ్రామస్తులు పంచాయతీ సిబ్బందిని కార్యాలయంలోనే నిర్బంధించారు. బీఆర్‌జీఎఫ్ నిధుల వినియోగంపై గ్రామ సభకు వచ్చిన అధికారులు తాగునీటి సమస్యను పట్టించుకోవడంలేదని ఆందోళ వ్యక్తం చేశారు. మహిళలు ఖాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.