అధిష్టానం ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా.

మల్కాజిగిరి.జనంసాక్షి.ఆగస్టు 23
తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆవిర్భావం నుండి పార్టీని నమ్ముకుని రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఉద్యమాలు చేసి జైలుకు వెళ్లామని మల్కాజిగిరి నియోజకవర్గంలో పార్టీ బలోపేతంలో ముఖ్యపాత్ర పోషించానని అధిష్టానం ఆదేశిస్తే మల్కాజిగిరి నియోజకవర్గం నుండి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని సీనియర్ నాయకులు బద్దం పరుశురాం రెడ్డి స్పష్టం చేశారు.బుధవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.ప్రస్తుత ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు టికెట్ ఇస్తే అందరం కలిసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని, ఆయనను కాదని బయటి వారికి ఇవ్వవద్దని,రాజకీయపరంగా నాకు ఎంతో అనుభవం ఉందని అధిష్టానం ఆదేశిస్తే మల్కాజిగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు.స్థానికులకు ప్రాధాన్యత కల్పిస్తే అందులో మొదటి వరుసలో నేనుంటానని అన్నారు.క్రమశిక్షణ గల పార్టీ నాయకుడిగా అధిష్టానం అప్పగించిన బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు.మచ్చలేని నాయకుడిగా నియోజకవర్గ ప్రజలకు ఎన్నో సేవలు అందించానని ముఖ్యమంత్రి కేసీఆర్,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశిస్తే నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.అధిష్టానం పునరాలోచించి స్థానికులకే ప్రాధాన్యత కల్పించాలని కోరారు.