అధిష్టానం ఎవరి బెదిరింపులకు భయపడదు: పొన్నం ప్రభాకర్
కరీంనగర్,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రం సాధించుకు రావల్సిన బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులపైనే ఉందని స్థానిక ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆయన గురువారం కరీంనగర్‌లో విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎవరిని మభ్య పెట్టడం లేదన్నారు. ఎవరి బెదిరింపులకు అధిష్టానం భయపడదని తెలిపారు.
తెలంగాణపై కేంద్రం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదే ఈని ఆయన వెల్లడించారు. ప్రజాస్వామ్యంపై అవగాహన ఉన్న వారిని మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలని పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.