అధిష్టానం పై ఒత్తిడికి ప్రయత్నం: శ్రీధర్‌బాబు
కరీంనగర్ : తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. యూపీఏ మిత్ర పక్షాలను ఒప్పించి ఏకాభిప్రాయం సాధనకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఊహాగానాలకు తావు లేకుండా తెలంగాణ పై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోవాలన్నారు.