అధ్యాపకులు అందరూ సమయపాలన పాటించాలి

— ఇంటర్మీడియట్ విద్యాధికారి సులోచన రాణి

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు అందరూ సమయపాలన పాటించాలని ఇంటర్మీడియట్ విద్యార్థి గారి బి సులోచన రాణి అన్నారు. గురువారం టేకులపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించి రికార్డులను పరిశీలించినారు. ఈ సందర్భంగా విద్యా సంవత్సరం 2022-2023 నకు సంబంధించిన ప్రవేశములను అడిగి తెలుసుకున్నారు. కళాశాల యందు అడ్మిషన్స్ తక్కువగా నమోదు కావడం గురించి కారణాలు అడిగి తెలుసుకున్నారు. అడ్మిషన్స్ పెంపొందించుకొనుట కొరకు సూచనలు చేశారు. ప్రతి ఒక్క అధ్యాపకులు పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల వివరాలు తెలుసుకొని ఇంటింటికి వెళ్లి కలువ వలసిందిగా కోరారు. అదేవిధంగా పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థుల వివరాలు సేకరించి వారిని కళాశాలలో చేరే విధంగా కౌన్సిలింగ్ చేయాలని చెప్పారు. విద్యార్థులకు పాఠాలు అర్థమయ్యేలా బోధించాలని ఈ విద్యా సంవత్సరానికి ప్రవేశముల సంఖ్య పెంచుటకు తగిన కృషి ప్రతి ఒక్కరూ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ కల్పన, అధ్యాపకులు కృష్ణమూర్తి, ముంతాజ్ అలీ, వేణుగోపాల్ ,యాకూబ్ ,వరలక్ష్మి ,కృష్ణమోహన్, జలీల్, ఉషశ్రీ ,అధ్యాపకేతర సిబ్బంది బుల్లారావు, రమేష్, చైతన్య పాల్గొన్నారు.