అనారోగ్యంతో విఆర్ఏ మృతి.

పరామర్శించిన తహసీల్దార్.
పోటో: 1) విఆర్ఏ కుటుంబాన్ని పరమర్శిస్తున్న తహసీల్దార్.
2) సాలక్క(ఫైల్)
బెల్లంపల్లి, సెప్టెంబర్19,(జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం కుశ్నపల్లి విఆర్ఏ ఎల్లూరి సాలక్క 52 సోమవారం అనారోగ్యంతో మృతి చెందింది. తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసిన విఆర్ఏ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న తహసీల్దార్ భూమేశ్వర్ కుశ్నపల్లి గ్రామానికి వెళ్లి సాలక్క కుటుంబాన్ని పరామర్శించారు. అంత్యక్రియలకు తక్షణ సాయం ₹ ఐదు వేల రూపాయల నగదు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సాలక్క కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు, ఇతరత్రా పనులు త్వరలోనే అందేలా చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారసత్వ ఉద్యోగం ఇవ్వడానికి ప్రయత్నిస్తానని భరోసా ఇచ్చారు. ఆయన వెంట మండల గిర్దవర్ గణేష్, జూనియర్ అసిస్టెంట్ ఖుర్షీద్, విఆర్ఏ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు దుర్గం శ్రీనివాస్, విఆర్ఏలు ఉన్నారు.