అని జిల్లాల్లో నిర్భయకేంద్రాలు:హరీష్
మెదక్: మహిళలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో నిర్భయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఇవాళ జిల్లాలోని సంగారెడ్డి కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో చిన్నారులు, మహిళల రక్షణ కోసం ప్రతిఒక్కరు కదలిరావాలని మంత్రి హరీష్ ప్రజాప్రతినిధులు,కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల కోసమే కాకుండా చిన్నారులను మరింత ఆరోగ్యంగా ఉంచేందుకు ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్, జేసీ వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



