అనుభవ వైద్యుల సంఘం అధ్యక్షునిగా పోలు శ్రీనివాస్.
: శ్రీనివాస్ ను సన్మానిస్తున్న వార్డు ప్రజలు.
బెల్లంపల్లి, అక్టోబర్2,(జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణ అనుభవ వైద్యుల సంఘం అధ్యక్షునిగా హనుమాన్ బస్తీకి చెందిన పోలు శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీనివాస్ ను టీఆరెస్ సీనియర్ నాయకుడు గోమాస తిరుపతి ఆధ్వర్యంలో బస్తి ప్రజలు శాలువతో సన్మానించి, ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో టీఆరెస్ కార్యకర్తలు, బస్తి ప్రజలు పాల్గొన్నారు.