అనుమతి లేని అక్రమ బెల్టుషాపులపై చర్య తీసుకోవాలి.

సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీనివాస్.
తాండూరు అక్టోబర్ 10(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం సిపిఎం ఆధ్వర్యంలో
సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు వైన్ షాప్ ల నుండి ఆదాయం పొందుతూ విచ్చలవిడిగా అను మతులు ఇస్తూ గ్రామీణ ప్రాంతాలలో  అనుమతి లేని అక్రమంగా బెల్టుషాపులు నిర్వహిస్తున్న వారిపై చర్య తీసుకోవాలని గతంలో తాండూరు పట్టణంలో వున్న ఎక్సైజ్ అధికారులకు  రెండుసార్లు  సిఐ, ఎస్ఐలకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారు.గ్రామీణ ప్రాంతాలలో అనుమతి లేని బెల్ట్ షాపులు నిర్వహిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ పద్ధతిలో వైన్ షాప్ లను  బెల్టుషాపులను నిర్వహిస్తూ కోట్ల రూపాయలు ప్రజల నుండి దోచుకుంటున్నారని తెలిపారు.
 అనేకమంది పేదలు కార్మికులు నిరుద్యోగులు మద్యానికి బానిసై తమ యొక్క కుటుంబ పై తీవ్రమైన ఇటువంటి ఆర్థిక భారం పడుతుంది అక్రమ పద్ధతిలో నడుస్తున్న బెల్టుషాపులు వైన్ షాపులు వెంటనే రద్దు చేయాలని లేనిపక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో ఎక్సైజ్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ ఎక్సైజ్ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల జిల్లా అధ్యక్షులు చంద్రయ్య, సిపిఎం నాయకులు జైపాల్, సిపిఐ నాయకులు అంజిలాప్ప ,నాయకులు శేఖర్ తదితరులు ఉన్నారు.