అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
ముధోల్ మండ లంలోని అష్టా గ్రామంలో యాస్రీంబేగం అలియాస్ సెమీన్ (24) అనే వివా హిత బుధవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు రూరల్ సీఐ శ్రీనివాస్‌తెలిపారు. పోలీసులు కుటుంబ సభ్యు ల కథనం ప్రకారం మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు చెందిన యాస్రీన్ బేగం ఆరు నెలల క్రితం తానూ ర్ మండలంలోని బెల్‌తరోడకు చెందిన అబ్దుల్ రహీంతో అలియాస్ అయూబ్ (29) వివాహం జరిగింది. వివాహ సమయంలో వరకట్న రూపం లో ఐదు గ్రాముల బంగారం, 12 గ్రాముల వెండితో రూ. 30వేల నగదు వస్తువులను ఇచ్చి నట్లు తెలిపారు. గత కొన్ని నెలల నుంచి అబ్దుల్ రహీం ముధోల్ మండలంలోని అష్ట గ్రామంలో మజీద్‌లో ఇమాంగా పనిచేస్తున్నాడని బాబు మియా తెలిపారు. మృతురాలి మామ బాబు మియా, అత్తఅబుదాబితో పాటు కోడలు వర కట్నం కోసం వేధించే వారని పేర్కొన్నారు. ఈ వేధింపుల భాగంగానే తన కూతురిని చంపారని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపించారు. గత పదిహేను రోజుల క్రితం రూ. 10వేల నగదుతో పాటు ఐదు గ్రాముల బంగారం ఇవ్వకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరించినట్లు తెలిపారు. భర్త వల్ల వారికి భిన్నంగా ఉండడం అనుమానాలకు తావిస్తుంది. తన భార్య రాత్రి సమయంలో కూలర్ల వేయడానికి వెళ్లడంతో విద్యుత్ గాలిలోకి గురై మృతి చెందినట్లు తెలిపారు.