అనుమాన పదస్థితిలో ఒకరి మృతి
రామారెడ్డి 8 జూన్ , జనంసాక్షీ
అనుమాన పదస్థితిలో ఒకరి మృతి చెందినట్లు ఎస్ఐ భువనేశ్వర్ వెళ్లడించారు. ఎస్ ఐ వివరాల మేరకు ఇలా ఉన్నాయి.మంగళవారం రాత్రి జరిగిన సంఘటన మృతుని పేరు బొదాసు స్వామి (26) , తండ్రి వెంకయ్య కులం ఒడ్డెర వృత్తి ఆటోడ్రైవర్ రామారెడ్డి ఒడ్డేర కాలనీలో నివాసం ఉంటున్నారు. మృతుని భార్య బొదాసు రోజ వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు ధర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వివరించారు.
