అన్నదాన కార్యక్రమానికి తుల్జాపూర్ బయలుదేరిన నాయకులు.
తాండూరు అక్టోబర్ 8(జనంసాక్షి)శ్రీ రేణుకా నాగ ఎల్లమ్మ భవాని మాత సేవా సమితి ఆధ్వర్యంలో తుల్జాపూర్ భవాని మాత దర్శనానికి పాదయా త్రగా వచ్చే భక్తుల సహాయార్థం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేస్తున్న విషయం విధితమే. అందులో భాగంగా తాండూరు సీనియర్ నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, సాయిపూర్ పట్లోళ్ల నర్సింలు, ఇందర్ చెడ్ రాజు పటేల్, శ్రీనివాస్ చారి తదితరులు బయలుదేరి వెళ్లారు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ మాట్లాడుతూ తుల్జాపూర్ భవాని మాత దర్శనానికి పాదయాత్రగా వచ్చే భక్తులకు
అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం భవాని మాత అమ్మవారి అశీర్వదం అన్నారు.అన్నిదా
నాలకన్న మిన్న అన్నదానం అన్నారు. దైవచింత
నతోనే మనసిక ప్రశాంతత లబిస్తుందన్నారు.