అన్నసంజీవని ద్వార మందుల పంపిణీ

ఏలూరు,నవంబర్‌28(జనం సాక్షి): దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారందరికీ అన్నసంజీవని దుకాణాల ద్వారా జనరిక్‌ మందులను పంపిణీ చేస్తున్నారు. నాలుగు లక్షల మందికి ప్రతినెలా మందులను ఇళ్లకు పంపించే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్‌ భాస్కర్‌ తెలిపారు. గ్రావిూణ ప్రాంతాల్లో 2.80 లక్షల మంది, పట్టణ ప్రాంతాల్లో 1.20 లక్షల మంది దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు. ఈ బాధ్యతలను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించగా వారు సరైన రీతిలో మందులు పంపిణీ చేయడంలేదని అసహనం వ్యక్తం చేశారు. జిల్లా గ్రావిూణాభివృద్ధి సంస్థ, మెప్మా, వయోజన విద్యాశాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలపై ఆయన సవిూక్షించారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలని అధికారులనుఆదేశించారు.ఇకపోతే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం కేటాయించిన నాలుగు కాలనీల్లో పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. మెట్ట ప్రాంతంలో నాలుగువేల ఎకరాలకు సాగునీరు అందించే చేగొండ ప్రాజెక్టు పనులు పూర్తికావచ్చా యన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. కోటిపల్లి- నరసాపురం రైల్వేలైను నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పక్రియను వేగవంతం చేయాలన్నారు.