*అన్నా చెల్లెల రాఖీ బంధం*
రక్తసంబంధం రాఖీ పండుగ
అన్నా చెల్లెల అనుబంధం రాఖీ పండుగ
ఆత్మీయతను పంచే రాఖీ పండుగ
రాఖీ కట్టి రక్షణగా ఉండాలని కోరే చెల్లె!!!
ఆగస్టు నెలలో వచ్చే ఆనందమైన పండుగ
ఆడపిల్లలకు ఆనందానిచ్చే పండుగ
అన్నా చెల్లెల్ని ఒక్కటి చేసే రక్షాబంధన్
మమత అనురాగాలను పంచే పండుగ!!!
అందరినీ ఒక్కటిగా చేసే రక్షాబంధన్
అవనిలో ఆడపిల్లలకు గౌరవాన్ని ఇచ్చే పండుగ
అన్నాతమ్ముళ్లకు అనుబంధానికి వారధిగా రక్షాబంధన్
అన్న తమ్ముళ్లు అన్నిట్లో విజయం గా ఉండాలని కోరే అక్కచెల్లలు!!!
అందమైన అనుబంధం
అంతులేని అనురాగం
అన్నాచెల్లెల బంధం రక్షాబంధన్!!!
నీవు నాకు రక్ష
నేను నీకు రక్ష
మనమిద్దరం కలిసి దేశానికి రక్షణగా ఉందాం
రక్షాబంధన్ శుభాకాంక్షలు!!!
రచన :-
దేవులపల్లి రమేశ్,
నంగునూర్, సిద్దిపేట జిల్లా
చరవాణి :9963701294