అన్నిపార్టీలు అభిప్రాయాలు చెప్పాలి : కేటీఆర్
వరంగల్ : అన్ని పార్టీలు ఈనెల 28న జరగనున్న అఖిలపక్ష భేటీలో తెలంగాణకు అనుకూలంగా తమ అభిప్రాయం చెప్పాలని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్ కోరారు. లేనిపక్షంలో ఆయా పార్టీలు తెలంగాణలో చేపడుతున్న పాదయాత్ర.. పరుగుయాత్రగా మారుతుందని అన్నారు. రాష్ట్ర గవర్నర్ రాజ్యాంగానికి లోబడి పనిచేయకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.